*భాషా పండితులకు ‘పదోన్నతి’ గౌరవం*

*భాషా పండితులకు ‘పదోన్నతి’ గౌరవం*

🔷ఫలించిన దశాబ్ద కాల నిరీక్షణ

🔷ఫిజికల్‌ డైరెక్టర్లుగా పీఈటీలు

🔷మొత్తంగా 10,800 మంది ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా


🔷దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం

🔷నేడు ఉత్తర్వులు జారీ

🔷ముఖ్యమంత్రికి ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు

🔷పదోన్నతులు, అంతర్‌ జిల్లాల బదిలీలకు వినతి

♦రాష్ట్రంలోని భాషా పండితుల దశాబ్ద కాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్‌-2 హోదాలో పనిచేస్తున్న భాషా పండితులు ఇక స్కూల్‌ అసిస్టెంట్లు కానున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) ఫిజికల్‌ డైరెక్టర్‌(పీడీ)గా పదోన్నతులు పొందనున్నారు. వీరికి పదోన్నతి కల్పించేందుకు ఉద్దేశించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సంతకం చేశారు. దీని వల్ల 8,800 మంది భాషా పండితులు, 2 వేల మంది వ్యాయామ ఉపాధ్యాయుల (మొత్తం 10,800 మంది) హోదా పెరగనుంది. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి.

♦సీఎంఓ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌, శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, *పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలు పూల రవీందర్‌, కె.జనార్దన్‌రెడ్డిలు మంగళవారం సీఎం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమక్షంలోనే దస్త్రాన్ని తెప్పించి, ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భాషా పండితులకు హోదా పెంపుపై ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నానని కేసీఆర్‌ చెప్పారు. దీనిపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.*

♦ఈ సందర్భంగా దేశపతి, పాతూరి, పూల రవీందర్‌, జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. భాషా పండితుల దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని, వారంతా సీఎంకు రుణపడి ఉంటారని అన్నారు.
*హోదా పెంపు వల్ల రాష్ట్రంలోని భాషా పండితులు అందరూ ఒకే గ్రేడ్‌లో ఉంటారని, ఇకపై గ్రేడ్‌-2 పండితుల పోస్టులుండవని తెలిపారు.* భాషా పండితుల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్‌ నెరవేర్చారని, తెలుగు భాషపై ఆయనకు ఉన్న అపార ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.


*♦ఏకీకృత సర్వీసులపై..*
ఏకీకృత సర్వీసులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు నిలుపుదల ఉత్తర్వులు(స్టే) ఇవ్వడంపైనా పాతూరి, రవీందర్‌, జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించారు. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని వారు కోరగా త్వరలోనే ఈ అంశంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

♦ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లాల బదిలీల ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, వేర్వేరు చోట్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భార్య,భర్తల బదిలీలు, పరస్పర అంగీకార (మ్యూచువల్‌)బదిలీలు చేపట్టాలని సీఎంను ఉపాధ్యాయ నేతలు కోరారు. అంతర్‌ జిల్లాల బదిలీలపై 2012 లోనే మార్గదర్శకాలు విడుదలయినప్పటికీ అమలు కావడం లేదని పేర్కొన్నారు. గతంలోనే సీఎం దీనికి హామీ ఇచ్చారని, ఇప్పుడు అడ్డంకులేవీ లేనందున ప్రక్రియ ప్రారంభానికి ఆదేశాలు జారీ చేయాలని వారు అభ్యర్థించారు. దీనిపైనా సీఎం సానుకూలంగా స్పందించారని వారు వెల్లడించారు.

*♦సీఎం వద్దకు ప్రత్యేక ఉపాధ్యాయుల దస్త్రం*
రూ.398 వేతనంతో నియమితులైన 11,363 మంది ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన దస్త్రం మంగళవారం రాత్రి సీఎం వద్దకు చేరింది. దీనిపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేసే అవకాశం ఉంది.

*♦ఉపాధ్యాయ సంఘాల హర్షం*
భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సరోత్తమ్‌రెడ్డి, కమలాకర్‌రావు, ఇతర ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

No comments:

Post a Comment

TS 3rd class English interactive workbook for SCERT worksheets

TS 3rd class English interactive workbook  This is the link for 3rd class interactive worksheet. It can be used in mobile and desktop or lap...