Ap Teacher News

AP టీచర్ న్యూస్
23-5-2020  శనివారం


💥ఉద్యోగులు ఇబ్బంది పడకూడదనే మే నెల పూర్తి జీతం@

 @ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.


 @సాక్షి అమరావతి: ఉద్యోగులు ఇబ్బంది పడకూడదనే మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులకు మే నెల జీతాలను పూర్తిగా చెల్లించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఆర్థిక శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మే వేతనాలను పూర్తిగా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రికవరీస్, మినహాయింపులతో రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించే విధానంతో మే నెల వేతనాలను చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు రెమ్యునరేషన్,గౌరవ వేతనాలను పొందే వారికి కూడా మే నెలకు సంబంధించి పూర్తిగా చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

@ప్రభుత్వ యూనివర్సిటీ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, బోర్డుల్లో పనిచేసే వారికి కూడా మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించనున్నారు. కోవిడ్ విపత్తు నేపథ్యంలో సీఎం, మంత్రుల వేతనాలను మార్చి, ఏప్రిల్ నెలల్లో పూర్తిగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.అలాగే ఉద్యోగుల మార్చి, మే నెల వేతనాలను సగం వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాయిదా వేసిన వేతనాలు చెల్లింపులు, మినహాయింపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

@'మినహాయించుకున్న వేతనాలు చెల్లించాలి'
ఉద్యోగులవేతనాల నుంచి మార్చి, ఏప్రిల్ నెలల్లో మినహాయించుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐకాస ఛైర్మన్ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఐకాస అమరావతి చైర్మన్ వెంకటేశ్వర్లు కోరారు.


💥వరుస క్రమంలో రైషనలైజేషన్, బదిలీలు*
*కమిషనరుకు  ఫ్యాప్టో లేఖ*

*🔹విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులు, నియామకాలు వరుసక్రమంలో జరపాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఫ్యాప్టో చైర్మన్ జి నారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్ కె.నరహరి శుక్రవారం లేఖ రాశారు.*

*🔸ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రాథమిక పాఠశాలలో 1:20, ప్రాథమికోన్నతలో 1:30, ఉన్నత పాఠశాలల్లో 1:35 ఉండాలని తెలిపారు.*

*🔹ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న నేపధ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల ఉపాధ్యాయ పోస్టు ఉండాలని కోరారు.*

*🔸ప్రాథమికోన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించి, ఆంగ్లం, ఫిజికల్ సైన్స్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు.*

*🔹బదిలీలకు కటాఫ్ జులై 31గా నిర్ణయించాలని తెలిపారు.*

 *🔸కనీస స్టేషన్ సర్వీస్ రెండేళ్లు, గరిష్టంగా ఎనిమిదేళ్లు ఉండాలని, ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లు ఉండాలని కోరారు.*

*🔹ప్రధానోపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరపవచ్చని, స్కూల్ అసిస్టెంట్లకు, ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు.*

*🔹బదిలీల అనంతరం ఖాళీగా ఉన్న అన్ని కేడర్లలో పదోన్నతులు నిర్వహించాలని తెలిపారు. పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే ఉపాధ్యాయుల పోస్టులకు వెంటనే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. వెంటనే 2018-డిఎస్సీ ప్రక్రియ చేపట్టాలని కోరారు.*

 *🔸ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.


💥 ఒకేసారి రెండు డిగ్రీలు :
ప్రతిపాదనకు యూజీసే గ్రీన్ సిగ్నల్. త్వరలో నోటిఫికేషన్ జారీ
ఒకటి రెగ్యులర్, రెండోది డిస్టెన్స్ విధానంలో అనుమతి.
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతించనుంది. ఇందుకు సంబంధిం చిన ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది. త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇకపై దేశంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు రెండు డిగ్రీ కోర్సులు కలిపి ఒకే విద్యా సంవ త్సరంలో పూర్తి చేయవచ్చు. అయితే రెండూ ఒకేసారి రెగ్యులర్ కోర్సులుగా ఉండేందుకు అనుమతి ఉండదు. సాధారణ కళాశాల తరగతులలో రెగ్యులర్‌గా ఒక కోర్సు, మరొకటి ఆన్లైన్లో దూరవిద్య(ఓఎల్‌డీ) ద్వారా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.
@ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పోటీని ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడు తుందని యూజీసీ అభిప్రాయపడింది.
@కొత్త విధానంలో విద్యార్థులు ఒకే సంస్థ లేదా వేర్వేరు సంస్థల ద్వారా ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను అభ్యసించగలుగు తారు. ఈ మేరకు యూజీసీ అనుమతి ఇచ్చిందని ఉన్నత విద్యాశాఖ అధికా రులు తెలిపారు. ఏకకాలంలో ద్వంద్వ డిగ్రీల కోసం వచ్చిన ప్రతిపాదనను ఇటీవల జరిగిన కమిషన్ సమావేశంలో ఆమోదించారని చెప్పారు.
@దీనికి సంబంధించి త్వరలో అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనున్నారని ఉన్న త విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
@ఏకకాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతి పాదనలు 2012లోనే యూజీసీ ముందు కువచ్చింది. ఈ ప్రతి పాదనను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి వైస్ చాన్స్ లర్ నేతృత్వంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించింది.
@రెగ్యులర్ విధానం కింద డిగ్రీలో చేరిన విద్యార్థి, అదే సమయంలో ఓపెన్ లేదా డిస్టెన్స్ విధానంలో గరిష్టంగా ఒక అదనపు డిగ్రీ చేయడానికి అనుమతిం చవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. రెగ్యులర్ మోడ్లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమ తించడానికి పాలనాపరంగా వీలుకాదని అభిప్రాయపడింది. @ఈ కమిటీ నివేదికపై నిపుణులతో కూడిన చట్టబద్ధమైన అకడ మిక్ కౌన్సిల్స్ అభిప్రాయం యూజీసీ కోరింది. అప్పటి కౌన్సిల్ సూచనల మేరకు బహుళ డిగ్రీ కార్యక్రమాలను యూజీసీ ఆమోదించలేదు.
@మారుతున్న ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు, పెరుగుతున్న పోటీ తత్వంతో విద్యార్థులు వాటిని ఎదుర్కొ నాలంటే పరిజ్ఞానం అవసరమని భావించి ఒకే సారి 2 డిగ్రీలకు అవకాశం కల్పిస్తోంది.

💥సామాన్యశాస్త్రానికి రెండు జవాబు పత్రాలు!
ఈనాడు, అమరావతి: పదో తరగతి సామాన్య శాస్త్రం పరీక్షకు రెండు జవాబుపత్రాలు(బుక్ లెట్లు) ఇచ్చే విష యమై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. పదో తరగతిలో ఏ సబ్జెక్టుకు లేనివిధంగా సామాన్య శాస్త్రానికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. ఒకరు భౌతిక, రసా మన శాస్త్రాలు, మరొకరు జీవశాస్త్రం, పర్యావరణ విద్యను బోధిస్తారు. ఇదే పద్ధతిలో విద్యార్థుల బాలు ట్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. రెండింటినీ ఒకే ఉపాధ్యాయుడు దిద్దడం కుదరదు. ఇందుకోసం రెండు ఆన్సర్ షీట్లు ఇవ్వాలని యోచిస్తున్నారు.

💥@జూలై 1 నుంచి 10, 12 తరగతుల పరీక్షలు@

@న్యూఢిల్లీ: పెండింగ్ లో ఉన్న 10, 12 తరగతుల పరీక్షలు జూలై 1 నుంచి 1 వరకూ జరగుతాయని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్ సీఈ) శుక్రవారం స్పష్టంచేసింది. 12వ తరగతి పరీక్షలు జూలై 2 నుంచి 12 వరకూ, 10వ తరగతి పరీక్షలు జూలై 1 నుంచి 14 వరకూ జరుగుతాయని తెలిపింది. పరీక్షకు వచ్చే విద్యార్థులు శానిటైజర్ బాటిళ్లు, మాస్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలని, చేతి తొడుగులు ఐచ్చికమని సీఐఎస్ సీఈ కార్యదర్శి గెర్రీ అరాథూన్ వెల్ల డించారు. పరీక్ష సెంటర్ల వద్ద భౌతిక దూరం పాటించేలా పాఠశాలలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో 6 పేపర్లు, 12 వ తరగతి పరీక్షల్లో 8 సబ్జెక్టులు ఉంటాయి.



💥అమరావతి, మే 22( ఆంధ్రజ్యోతి):
@యూనిఫామ్ కోసం రూ.80 కోట్లు@
@ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే 7,59574 మంది విద్యార్థులకు యూనిఫాం క్లాత్, కుట్టు పార్టీ కోసం రూ.80.4 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక జత యూనిఫాం కుట్టు పార్టీ కింద రూ.80 విద్యార్థులకు అందజేశారు. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

💥టెన్త్ పరీక్ష కేంద్రాలు 329!
అదనంగా 92 పెంపు.. విద్యా శాఖ కసరత్తు
ఏలూరు ఎడ్యుకేషన్, మే 22 కొవిడ్-19 నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో తొలుత ఏర్పా టు చేసిన 287 పరీక్ష కేంద్రాలస్థానే 329 కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ 92 కేంద్రాల పెంపు
పై డీవైఈవోల నుంచి జిల్లా విద్యా శాఖ నివేదికలు కోరింది. ఏలూరు డివిజన్ లో తొలుత ఏర్పాటు చేసిన 51
సెంటర్లకు అదనంగా 25, తణుకు డివిజన్లో 45 కేంద్రా లకు అదనంగా 8, భీమవరం డివిజన్ లో 57 కేంద్రాలకు అదనంగా 22, తాడేపల్లిగూడెం డివిజన్లో 45 కేంద్రాలకు అదనంగా 24, కొయ్యలగూడెం డివిజన్లో 33 కేంద్రాలకు అదనంగా 19 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. కొద్ది పాటి మార్పులతో దాదాపు ఇవే పరీక్ష కేంద్రాలు ఖరా రయ్యే అవకాశం ఉంది. కొయ్యలగూడెం డివిజన్లో అద నపు పరీక్ష కేంద్రాల ఎంపిక నేపథ్యంలో తొలుత ఏర్పాటు చేసిన సెంటర్లలో మూడింటిని ఎత్తివేశారు. పరీక్ష గదు లు బాగా ఎక్కువగా ఉండడం, పరీక్షార్థుల మధ్య నాలుగ డుగుల భౌతికదూరం పాటించడం సాధ్యం కానందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అదనపు పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు పాఠశాలలను తీసుకునేందుకు ప్రభుత్వ సూచనల మేరకు నిబంధనలను సడలించారు. జిల్లాలో మొత్తం 50,027 మంది విద్యార్థులు (రెగ్యులర్, వన్స్ ఫెయిల్డ్) పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసు కున్నారు. లా డౌన్, కొవిడ్ నిబంధనల దృష్యా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని విద్యార్థులకే కల్పించారు. జిల్లాలో మొత్తం 46 వేల మంది విద్యార్థుల ఆపను తీసుకోవాలని స్కూల్ హెచ్ఎంలకు బాధ్యతలు అప్పగించడంతో కసరత్తు జరుగుతోంది. విద్యార్థుల నుం చి ఆప్షన్లు వచ్చిన తరువాత ప్రభుత్వ నిర్ణయం తీసుకుని హాల్ టిక్కెట్ల ముద్రణ చేపడతారు.

No comments:

Post a Comment

TS 3rd class English interactive workbook for SCERT worksheets

TS 3rd class English interactive workbook  This is the link for 3rd class interactive worksheet. It can be used in mobile and desktop or lap...