TSRJC CET Application Date Extended

TSRJC-CET దరఖాస్తు గడువు పెంపు

TSRJC CET


*తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 35 రెసిడెన్షియల్ కాలేజీల్లో 2020-2021 విద్యా సంవత్సారానికిగాను ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే TSRJC-CET 2020 ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది.*


*రాష్ట్రంలో  కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది.*

*ఆన్ లైన్ దరఖాస్తు గడువును జూలై 10, 2020 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఎస్. వెంక‌టేశ్వ‌ర శ‌ర్మ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సొసైటీ గురువారం (మే 28, 2020) ఒక ప్రకటనలో తెలిపిది.*

*ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లలో ప్రవేశాలు కల్పిస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని అభ్యర్దులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను*
 https://tsrjdc.cgg.gov.in/
*వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.*

*ఏవైనా సందేహాలు ఉంటే 040 - 24734899 లేదా 949 096 7222 నెంబర్లను సంప్రదించొచ్చు.*

*విద్యార్హత : మార్చి 2020 పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ  విద్యార్ధులు మాత్రమే అర్హులు.*

*పరీక్ష విధానం : TSRJC ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2:30 గంటలు ఉంటుంది.*

*దరఖాస్తు ఫీజు : అభ్యర్ధులు రూ.200 చెల్లించాలి.*

*దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 16, 2020*

*దరఖాస్తు చివరి తేదీ : జూలై 10, 2020*

No comments:

Post a Comment

TS 3rd class English interactive workbook for SCERT worksheets

TS 3rd class English interactive workbook  This is the link for 3rd class interactive worksheet. It can be used in mobile and desktop or lap...