క్రింది స్థాయి ఉద్యోగ శ్రేణి సేవలు (Subordinate Service) అంటే ఏమిటి?

క్రింది స్థాయి ఉద్యోగ శ్రేణి సేవలు(Subordinate Service) అంటే ఏమిటి?


Subordinate Service


*రాష్ట్ర ఉన్నత ఉద్యోగశ్రేణి సేవలకు సంబంధించిన నియమ నిబంధనలు పద్ధతి మాదిరిగానే క్రిందిస్థాయి ఉద్యోగ శ్రేణి నియమావళి కొన్ని మార్పులు
విశదీకరించారు.*

*అన్ని రకాల నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించిన విధుల అంశాలపై రూపొందించిన నియమావశిని క్రిందిస్తాయి ఉద్యోగ శ్రేణి సేవలు (Subordinate Service) మనము గుర్తించుకోవాలి. నాన్ గెజిటెడ్ (N.G.OS) ఉద్యోగులకు సంబంధించిన ఎంపిక (Selection) విధానాలు నియామక విధానాలు, నియమించిన ఉద్యోగానికి ఆ అభ్యర్థి ఏమేరకు న్యాయం చేస్తాడు అనే అంశాన్ని నిర్ధారించే అంశం (Probation), అందు నిమిత్తం నిర్దేశించిన కాలపరిమితి (Probationary Period) క్రమబద్ధీకరణ జాబితా యందు జ్యేష్ఠత / ప్రాధాన్యత (Seniority) పదోన్నత పద్ధతులు, అందుకు సంబంధించిన ప్రాధాన్యత జాబితా (Seniority List) తయారు చేయు విధివిధానాలు, తదితర అంశాలపై క్రింది స్థాయి ఉద్యోగ శ్రేణి సేవల (N.G.Os) లో విశదీకరించారు. రాష్ట్ర ఉన్నత ఉద్యోగ శ్రేణి సేవలు (Gazetted) మరియు కింది స్థాయి ఉద్యోగ శ్రేణి సేవలు (N.G.Os) కలిపి, రాష్ట్ర ఉన్నత ఉద్యోగ శ్రేణి
మరియు క్రింది స్థాయి ఉద్యోగ శ్రేణి సేవలుగా (A.P.State and SubordinateServices rules 1996) ప్రధాన సాధారణ నియమావళిగ (General Rules)నిర్దేశించారు.*

*ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను, రాష్ట్ర ఉన్నత ఉద్యోగి శ్రేణుల వర్గంగాను మరియు క్రింది స్థాయి ఉద్యోగ శ్రేణులుగాను వర్గీకరించటం (A.P.State and
Subordinate Services rules 1996) మనం తెలుసుకున్నాం.*

*ఈ రెండింటి సేవల విభిన్న విధివిధానాలు, నియమావళి కొంతమేరకు క్షుణ్ణంగా ఇంతవరకు తెలుసుకున్నాము. ఈ రెండు కూడా విభిన్న పద్ధతులు గా వున్నటు వంటి సేవలుగాను గుర్తించాము. ఈ విషయమై ఇంకా కొంతమేర వాటిలోని వ్యత్యాసాలను కూడా  మనం తెలుసుకోవాలి.*

*సర్వ సాధారణంగ మనదైనందిన పాలనా పద్ధతులలో, ఒక వ్యక్తికి తను చేస్తున్న ఉద్యోగికి పై స్థాయి ఉద్యోగానికి పదోన్నతి (Promotion)
కల్పించేటప్పుడు మనము రెండు పదాలు ఉపయోగిస్తుంటాము. ఒకటి పదోన్నతి(Promotion), రెండవది సేవలు (Services) మార్పు (Transfer) చేస్తూ పై పదవిలో నియమించటం. (Appointment by Transfer of service) పై రెండు సందర్భాలలోను అతను చేస్తున్న ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగికి
అర్హతల మేరకు పదోన్నతి (Promotion) అని, మరొక సందర్భంలో సర్వీసులు మార్పు చేస్తూ పదోన్నతిపై నియామకం (Appointment by Transfer) అని
విభిన్న పదాలు ఉపయోగిస్తున్నాము. ఆ విధంగా ఒకే విషయమై రెండు రకాల పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నామో, ఈ క్రింద తెలిపిన ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము.*

*క్రింది స్థాయి ఉద్యోగా శ్రేణిలో (Subordinate Services-N.G.Os) పని చేస్తున్న ఒక జ్యేష్ఠ / ఎగువ శ్రేణి సహాయకులు (Senior Assistant) గా పని చేస్తున్న వ్యక్తి పై స్థాయి ఉద్యోగ స్థానానికి, అనగా పర్యవేక్షకునిగ (Super intendent) నియమించదలచుకున్నపుడు పదోన్నతి పదం ఉపయోగిస్తాం. ఎందుకనగా అతను పనిచేస్తున్న జ్యేష్ఠ/ఎగువ శ్రేణి సహాయక పదవి అనే విధంగా పైస్థాయి ఉద్యోగమైన పర్యవేక్ష పదవి, రెండు కూడా క్రింది స్థాయి ఉద్యోగ శ్రేణి సేవలకు చెందినవి. ఎగువ శ్రేణి సహాయకునికి పై స్థాయి ఉద్యోగమైన పర్యవేక్షకునిగా పదోన్నతి కల్పించినప్పటికి
అతని సేవలు క్రింది స్థాయి ఉద్యోగ సేవలలొనే కొనసాగుతాయి. అతను క్రింది స్థాయి ఉద్యోగి శ్రేణి ఉద్యోగిగానే పరిగణించబడతారు. అందువలన అలాంటి సందర్భాలలో పదోన్నతి(promotion) అన్న పదమే ఉపయోగించాలి.*

*ఒక వేళ క్రింది స్థాయి ఉద్యోగం సేవలు(subordinate servicesrules -N.GOs) లో ఉన్నటువంటి పర్యవేక్షకులను (Superintendent తదుపరి పైస్థాయి ఉద్యోగం, సహాయ నంచాలకులుగా పదోన్నతి అని కాకుండా సబార్టీనేట్ సర్వీసులనుండి స్టేటు సర్వీసులకు  మార్పిడి చేస్తూ అక్కడ అతనిని నియమించ వలసి యున్నది. అందువలన అలాంటి సందర్భాలలో మనము సర్వీసులు మార్చు చేస్తు నియామకం అన్న పదం ఉపయోగిస్తాము. అంటే ఒక సర్వీసు నుంచి ఇంకొక సర్వీసుకు అతని సేవలు మార్పు చేస్తున్నాము. కాబట్టి సందర్భానుసారంగా సర్వీస్ మార్పులతో నియామకం (Appoinimlentl by Inter) అను పదము ఉపయోగిస్తాము.*

*అదే విధంగ నాల్గవ తరగతి సర్వీసులో వున్నటువంటి కార్యాలయపు అతితక్కువ స్థాయి గల ఉద్యోగిని కనిష్ట స్థాయి  సహాయకునిగ నియమ నిబంధనల మేరకు నియమించదలచు కున్నప్పుడు అతని సర్వీసులను మినిస్టీరియల్ సర్వీసులకు
మార్చు చేస్తూ అట్టి సర్వీసులో నియమించ వలసి యున్నది. అలాంటి సందర్భాలలో సర్వీస్ మార్పు చేస్తూ నియమించడమైనది. Appointment by transfer అన్నటువంటి పదము ఉపయోగించవలసి యున్నది. పదోన్నతి అనే అన్న పదము ఉపయోగించరాదు.*

*రికార్డు సహాయకునిగ (Record Assistant)గా పనిచేయుచున్న వ్యక్తిని కనిష్ట స్థాయి సహాయకుడిగా (Junior Assistant) నియమ నిబంధనల మేరకు
నియమించే సందర్భంలో కూడ సర్వీసు మార్చు చేస్తు నియమించడమైనది.*
*Appointment by Transfer అన్న పదం మాత్రమే ఉపయోగించాలి. మనం (Promotion) అన్న పదము ఉపయోగించరాదు. ఎందుకంటే రికార్డు సహాయకుడు (Record Assistant) సేవలు సాధారణ కనిష్ట సేవలుగ పరిగణించబడినవి.*

*అదే విధంగా ఒక సర్వీసు నుంచి ఇంకొక సర్వీసు, ప్రభుత్వం నిర్దేసించిన నియమ నిబంధనల ప్రకారం అర్హులైన వారి సర్వీసులు మార్పు చేసి నియామకపు ఉత్తర్వులు జారీ చేయు సందర్భాలలో " సర్వీసులు మార్పు చేస్తూ నియమించడమైనది. (Appointment by Transfer) అన్నటువంటి పదము మాత్రమే ఉపయోగించాలి. ఆ విధంగా మార్పు చేయు సందర్భంలో సంబంధిత సర్వీసుల సేవల (Services) నియమావళి అనుమతిస్తుందా లేదా అన్న విషయాన్ని, చర్య చేపట్టి వేసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలి.*

*ఒక సర్వీసు నుంచి ఇంకొక సర్వీసుకు మార్పు చేస్తు నియామకాలు చేసేటప్పుడు, ఆ వ్యక్తి తన మొదటి సర్వీసులో ప్రాజెషను కాలము పూర్తి చేసినకాలము కాక ఆమోదించ బడినటువంటి వ్యక్తిగా (Approved Probation) గా వుండవలెను.*
*(రూలు (6) (2) A.P.State and Subordinate Services rules 1996)*

No comments:

Post a Comment

TS 3rd class English interactive workbook for SCERT worksheets

TS 3rd class English interactive workbook  This is the link for 3rd class interactive worksheet. It can be used in mobile and desktop or lap...